అ
దుపుతప్పి ఇటుక లారీ బోల్తా
బోల్తా పడిపోయిన ఇటుకల లారీ
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
సోమవారం మండలంలోని జలాల్పురం గ్రామ శివారులో గల చెరువు మూల మలుపులు ఇటుకలారి బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పురపాలక కేంద్రంలోని నారాయణగిరి ఇటుక బట్టీల వద్ద ఇటుకలోడును నింపుకొని తిరిగి వయా మోడల్ స్కూల్ జలాల్పురం గ్రామాల మీదుగా ఘట్కేసర్ వెళ్దామని డ్రైవర్ పవన్ అనుకున్నాడు. జలాల్పురం సమీపంలో చెరువు వద్దకు రాగానే లారీ స్టీరింగ్ విరిగిపోవడంతో అతివేగంగా ఉన్న లారీ అదుపుతప్పడంతో సరాసరి చెరువులో ఊరికి వెళ్ళిపోయింది. ఈ సమయంలోనే లారీలో ఉన్న ఇటుక హెవీ లోడ్ కావడంతో కేవలం ఇంజన్ మాత్రమే చెరువులో పడిపోగా ఇటుకల లోడు మొత్తం రోడ్డుపైనే పడింది. ఇంజన్ తో సహా చెరువులో పడిపోగా వెంటనే డ్రైవర్ పవన్ చాకచక్యంతో లారీలో నుండి బయటపడి చెరువులో నుండి బయటకు వచ్చాడు. ఇది గమనించిన అటుగా వెళుతున్న ప్రయాణికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడ చేరుకొని డ్రైవర్ అవన్నీ పరిశీలించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని రాకపోకల ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లను చేశారు.