Tuesday, April 8, 2025
HomeBlogఅద్వాని కి  ఇంటికీ వెళ్ళి భారతరత్న ప్రదానం.. అందజేసిన రాష్ట్రపతి :ద్రౌపతి ముర్ము :

అద్వాని కి  ఇంటికీ వెళ్ళి భారతరత్న ప్రదానం.. అందజేసిన రాష్ట్రపతి :ద్రౌపతి ముర్ము :

అద్వానీకి భారతరత్న ప్రదానం.. ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము

నారద మర్తమాన సమాచారం:న్యూ డిల్లీ :ప్రతినిధి

భాజపా అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు..

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన హాజరుకాలేక పోయారు. దీంతో ఆయన నివాసానికే వెళ్లి నేడు పురస్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు..

తెలుగుబిడ్డ పి.వి.నరసింహా రావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను శనివారం మరణానంతరం ప్రదానం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపదీ ముర్ము నుంచి పీవీ కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు దీనిని స్వీకరించారు. మరో మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌, హరిత విప్లవ పితామహుడిగా పేరొందిన వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌.స్వామినాథన్‌, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకుర్‌లకు కూడా మరణానంతరం ప్రకటించిన ఈ పురస్కారాలను వారివారి కుటుంబ సభ్యులు స్వీకరించారు. చరణ్‌సింగ్‌ తరఫున ఆయన మనవడు జయంత్‌ చౌధరి, స్వామినాథన్‌ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు, కర్పూరీ ఠాకుర్‌ తరఫున ఆయన కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకుర్‌లు పురస్కారాలు అందుకున్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?