21రోజులు మృత్యువుతో పోరాడి దివికెగిసిన యువజన సంఘం మాజీ అధ్యక్షులు అంగ సంతోష్
అంతక్రియలకు హాజరైన భోథ్ నియోజకవర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు ….
రిపబ్లిక్ హిందూస్థాన్, బజార్ హత్నుర్ :
తెలంగాణ మలి దశ ఉద్యమకారుడు , దేగామా యువజన సంఘం మాజీ అధ్యక్షుడు అంగ సంతోష్ అనారోగ్యంతో కన్నుమూశారు. తెలంగాణ సాధనలో బజార్ హత్నూర్ మండలంలో ప్రతి ఒక్క ఉద్యమ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ,ఎలాంటి లాభాపేక్ష లేకుండా,పదవులు ఆశించకుండా నిస్వార్థంగా ఉద్యమంలో పాల్గొంటూ అందరి మన్ననలు పొందుతూ, స్థానిక దేగామ గ్రామ యువజన సంఘంలో కీలక పాత్ర పోషిస్తూ,గ్రామంలో ప్రతి ఒక్కరి మనసులో మంచి స్థానం సంపాదించుకున్న దేగామ గ్రామానికి చెందిన అంగ సంతోష్ గత కొన్ని రోజుల క్రితం ఊపిరితిత్థుల
ఇన్ఫెక్షన్ తో,ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతు మృతి చెందాడు. కుటుంబీకులు నిజామాబాద్ మరియు హైదరాబాద్ లోని ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులలో ఖరీదైన వైద్యం చేయించినా చివరికి శుక్రవారం చికిత్స పొందుతూ ఉదయం1-00 గంట సమయంలో గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. ఉద్యమ యువనాయకుని మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంగ సంతోష్ కి గత సంవత్సరమే వివాహం జరిగిందని స్థానికులు తెలిపారు. అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి చనిపోవడంతో గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

స్థానిక కార్యకర్తల ద్వారా విషయం తెలుకున్నా భోథ్ నియోజకవర్గ శాసనసభ్యులు రాథోడ్ బాపురావ్ సంతోష్ అంతక్రియలకు స్థానిక మండల నాయకులతో కలిసి హాజరయ్యారు. యువనాయకుని మృతికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. గ్రామ ప్రజలు మంచి మనసున్న యువకున్ని కోల్పోయామని బాధపడ్డారు. కుటుంబ సభ్యుల రోదన పలువురి ని కంటతడి పెట్టించింది.