
నారద వర్తమాన సమాచారం
అన్నమయ్య జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి?
అన్నమయ్య జిల్లా
:మే 17
అన్నమయ్య జిల్లాచిన్న మండెం మండలం, సమీపంలోని మొటుకు అడవిలో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి చెందింది.
మహిళను ఉరి తీసి చంపారా? లేక ఆత్మహత్య చేసుకుందా?ఈ సంఘటన శుక్రవారం వెలుగు చూసిం ది. తీవ్ర కలకలం రేపిన ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
గుర్రంకొండ మండలం తుమ్మలగుండు సమీపం లోని మొటుకు అడవిలో సుమారు 25 ఏళ్ల వయ సున్న గుర్తుతెలియని యువతి ని అడవిలోనికి తీసుకెళ్లి మొదట హత్య చేసి పథకం ప్రకారం ఆత్మ హత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు.
ఘటన సమాచారం అందు కున్న గుర్రంకొండ, చిన్న మండెం పోలీసులు సంఘ టన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిం చారు. ఘటన జరిగిన ప్రదేశం చిన్నమండెంకు వస్తుందా? లేక గుర్రంకొండ మండలానికి చెందు తుందా? అన్నది ఫారెస్ట్, రెవిన్యూ అధికారులు తేల్చాల్సి ఉండడంతో కేసు దర్యాప్తులో ఉంది…