నారద వర్తమాన సమాచారం
మే :21
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
అమరావతి రాష్ట్రంలో మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాసింది.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది. మే 22 నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టు నుంచి ఉన్న రూ.1,500 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేసింది..
సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ఇప్పటివరకు కేవలం రూ.50 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారని లేఖలో పేర్కొంది..