

అర్ధరాత్రి అక్రమ మట్టి దందా
సూర్య పేట జిల్లా చింతలపాలెం మండలం
నారద వర్తమాన సమాచారం ప్రతినిధి
చింతలపాలెం మండలం నందు
స్థానిక టిఆర్ఎస్ నేత కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయకుండగా మట్టి మాఫియాని కొనసాగించడం జరుగుతుంది.
ఆంధ్ర ప్రాంతం నుంచి ఎటువంటి బార్డర్ టాక్స్ కట్టకుండా వందల సంఖ్యలో ట్రిప్పర్లను తీసుకొచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నారు
సదరు ట్రీప్పరు డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లు కూడా లేవు..
ఇదేమిటి అని ప్రశ్నించిన విలేకరులను బెదిరించి తప్పుడు కేసులు బనాయించారు.
మాకు అన్ని విధాలుగా అధికారులు సహాయం ఉంది అని మీరు ఎవరు అని కొట్టి తప్పుడు కేసులు పెట్టారు.
ఇదేమిటి అని అధికారులను అడగగా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మట్టి మాఫియా జరగటం లేదు అని అధికారులు అనడం శోచనీయం.