నారద వర్తమాన సమాచారం
ఆంధ్రప్రదేశ్‌కు మరో పవర్‌ఫుల్ ఐపీఎస్ అధికారి రాబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. ఆయన ఒకటి, రెండు రోజుల్లో రాష్ట్రానికి తిరిగి రాబోతున్నారు. రవికృష్ణ ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన్ను సొంత క్యాడర్ ఏపీకి పంపేందుకు ప్రతిపాదనల్ని డీవోపీటీ (కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వశాఖ) ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలియజేశారు.ఏపీకి వస్తున్న ఆకే రవికృష్ణకు కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయనకు గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ బాధ్యతను రవికృష్ణకు అప్పగించే అవకాశం ఉంది. ఆకే రవికృష్ణ 2006 బ్యాచ్‌కు చెందిన ఐజీ క్యాడర్ అధికారి.. ఆయన గతంలో వనపర్తి, పార్వతీపురం, చింతపల్లిలో ఏఎస్పీగా పనిచేశారు. అలాగే కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేశారు.. ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లాల ఎస్పీగా, టీటీడీలో ముఖ్య భద్రతాధికారిగా పనిచేశారు. అనంంతరం 2018 నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు.మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళికి కూడా ఏపీకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు పంపించేందుకు కేంద్రం ఆమోదం తెలపగా.. ముందు మూడేళ్లపాటు ఆయన ఏపీలో డిప్యుటేషన్‌పై కొనసాగేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు డీవోపీటీ (కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ) డైరెక్టర్ సాక్షి మిత్తల్ ఈ నెల 6న జారీచేసిన ఉత్తర్వులు తాజాగా బయటకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమౌళిని సీఎంవో (ముఖ్యమంత్రి కార్యాలయం)లోకి తీసుకోనుంది. ఆయన ఏపీలో రిపోర్టు చేయగానే ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజమౌళి ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్ 2003 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. రాజమౌళి గతంలో టీడీపీ ప్రభుత హయాంలో.. 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంవోలో పనిచేశారు. ఆయన ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఏపీకి తిరిగి వస్తున్నారు.