
ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అందజేత….
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు…
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి:మార్చి30,
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై రంగంపేట గ్రామానికి చెందిన నర్సవ్వ (48) కు ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు సహకారంతో కెబిఏస్ కేంద్రంలో ఓ నెగెటివ్ రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నెగిటివ్ రక్తానికి సంబంధించిన రక్తదాతలు చాలా తక్కువ సంఖ్యలో ఉండడం జరుగుతుందని ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తాన్ని అందజేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రాజు కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలియజేశారు.