రిపబ్లిక్ హిందూస్థాన్,ఇచ్చొడా : ఇచ్చోడా మండల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి ఏ.సాగర్ సాత్ నెంబర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కాలనీల్లో తిరుగుతూ ఇంటిపరిసరాల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలని అన్నారు.

మరియు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ఇంటింటికి తిరిగి పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నీటి నిల్వ ఉండకుండా చూడాలన్నారు.