
నారద వర్తమాన సమాచారం
రామోజీరావు మృతిపట్ల కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి
తెలంగాణ
:జూన్ 08
ఈనాడు మీడియా దిగ్గజం రామోజీరావు పార్థివ దేహాన్ని డైరెక్టర్ రాజమౌళి ఈరోజు ఉదయం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. రామోజీ భౌతికకాయాన్ని చూడగానే కన్నీళ్లు ఆపుకో లేకపోయారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యా రు. రామోజీ నిర్మాతగా రాజమౌళి ‘శాంతినివాసం’ సీరియల్ తీశారు.
బాహుబలి సహా ఎన్నో చిత్రాలను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు. ఈక్రమంలోనే రాజమౌళికి రామోజీరావుతో విడదీయ రాని బంధం ఏర్పడింది.