నారద వర్తమాన సమాచారం
ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి
ఉక్రెయిన్, రష్యా మధ్య 96 మంది ఖైదీల మార్పిడి
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఉక్రెయిన్, రష్యాలు చెరో 95 మంది యుద్ధఖైదీలను మార్పిడి చేసుకున్నాయి. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇది 54వ ఖైదీల మార్పిడి. ఈ ప్రక్రియలో యునైడెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మధ్యవర్తిత్వం వహించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. మాస్కో, కీవ్‌లతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని యూఏఈ కూడా పేర్కొంది