

నారద వర్తమాన సమాచారం:పొదలకూరు:ప్రతినిధి:
పొదలకూరు పట్టణంలోని మారుతీనగర్, రామ మందిరం వీధిలో ఆదివారం నాడు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాణి పూజిత స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని తెలిపిన కాకాణి పూజిత
ప్రతీ వీధిలో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్ లు వంటి మౌలిక వసతులతో పాటు పరిష్కారానికి నోచుకోని ఎన్నో సమస్యలను తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరిష్కరించారన్న కాకాణి పూజిత
పొదలకూరులో ప్రతి ఇంటికి వెళుతుంటే.. తన కుటుంబ సభ్యులను కలిసినట్లుగా ఉందన్న కాకాణి పూజిత
ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ని, ఎమ్మెల్యేగా తన తండ్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేసిన కాకాణి పూజిత