నారద వర్తమాన సమాచారం
కర్ణాటకలో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు మృతి?
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకోలా-శిరాలీ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. అక్కడే ఉన్న ఓ హోటల్పై పడటంతో దాదాపు 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు ఇప్పటికే మృతిచెంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు.