తెరాస మండల కన్వీనర్ ను సన్మానించిన హిరాపూర్ గ్రామస్తులు….
రిపబ్లిక్ హిందూస్థాన్ :
ఇచ్చొడా మండల కన్వీనర్ ను హిరాపూర్ గ్రామస్థులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలందరికి అండగా ఉంటామని చెప్పారు. బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు ఆశీస్సులతో మరింత మందికి సేవ చేసే అవకాశం వచ్చిందని అన్నారు.మండల కన్వీనర్ గా బాధ్యత లు చేపట్టి చురుకుగా పార్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏనుగు కృష్ణ రెడ్డిని ఇచ్చోడ మండలంలోని హిరపూర్ గ్రామములో రాథోడ్ ప్రకాష్ ఆధ్వర్యములో గ్రామస్థులు యువకులు కలసి సన్మానించారు. కన్వీనర్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని,కార్యకర్తలంతా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు పార్టి పటిష్టానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమములో ఆత్మ ఛైర్మెన్ నరాల రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ముస్తఫా, ఎంపీటీసీ సుద్దవార్ వెంకటేష్, దాసరి భాస్కర్, రాథోడ్ ప్రవీణ్, గణేష్,తదితరులు పాల్గొన్నారు..