కార్యాలయాల తరలింపుతో అభివృద్ధి కుంటుపడుతుంది…
రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ :ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రం నుండి కార్యాలయాల తరలింపు ఆపాలని , తరలిపోయిన కార్యాలయాలను వెనక్కి తిరిగి బోథ్ లో ప్రారంభించాలని బోథ్ బచావ్ ఆందోళన్ సమితి డిమాండ్ చేసింది. ఆదివారం రోజు బోథ్ మండలం లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
ఇందుమూలముగా సమస్త పాత్రికేయ మిత్రులకు & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు
నేడు బోథ్ మండల కేంద్రం నుంచి తరలిపోయిన కార్యాలయాలను వెనక్కు రప్పించాలని, నూతనంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, విద్యాసంస్థలను రప్పించాలని, 13 సమస్యలతో కూడినటువంటి ఉత్తరాలను స్థానిక శాసనసభ్యులు బోథ్ రాథోడ్ బాపురావు , స్థానిక పార్లమెంటు సభ్యులు సోయం బాపూరావులకు ఉత్తరాల ద్వారా వినతి పత్రాలు పంపించారు.
స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో కుల, మత ,రాజకీయ పార్టీలకతీతంగా సమావేశం ఏర్పాటు చేయడం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించ పలువురు మాట్లాడారు, ఈ కార్యక్రమంలో లో యువజన సంఘల నాయకులు షేక్ షాకీర్, చంటి పసుల, మహేందర్ కూర్మే, షేక్ నాజర్ హమ్మద్,సల్ల రవి,సుమేర్ పాషా,శహబాస్,రుక్మణ్ సింగ్ సురేందర్ యాదవ్, బండారి శ్రీధర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, వార్డ్ నెంబర్లు పాల్గొన్నారు.