నారద వర్తమాన సమాచారం
న్యూ ఢిల్లీ:
జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్: కేంద్రం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25ను ‘సంవిధాన్ హత్యా దివాస్’గా ప్రకటించింది.
1975 జూన్ 25న ఎమర్జెన్సీ ప్రకటించింది ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ. అయితే ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా ‘సంవి ధాన్ హత్యా దివాస్’ను తాజాగా ఈరోజు కేంద్రం ప్రకటించింది.
కేంద్ర నిర్ణయాన్ని ఎక్స్‌లో ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ఎమర్జెన్సీ ను విధించడం ద్వారాప్రజాస్వామ్య ఆత్మను హత్య చేశారని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు.
ఎమర్జెన్సీ సమయంలో లక్షల మందిని జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆయన గుర్తుచేసుకున్నారు.