మంచిర్యాల మార్చ్ 8 (రిపబ్లిక్ హిందుస్థాన్) : జన్నారం మండలం మురిమడుగు గ్రామానికి చెందిన కొండ్ర రాజన్న గత నెల క్రితం ఒమాన్-సాలలా పట్టణంలో లో గుండెపోటు తో మరణించాడు.తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో వెంటనే ఇండియన్ కౌన్సిలేట్ మరియు కంపెనీతో మాట్లాడి కొండ్ర రాజన్న మృతదేహాన్నీ స్వగ్రామానికి తీసుకొనిరావడానికి ఎంతో కృషి చేశారు.టిజిడబ్ల్యుడబ్ల్యుసి తరుపున మృతుని కుటుంబానికి 16000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కల్లెడ భూమయ్య మాట్లాడుతూ కొండ్ర రాజన్న కుటుంబం చాలా నిరుపేద కుటుంబం రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో ఇంటి యజమాని కోల్పోయిన కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 500 కోట్ల తో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సేపూర్ గోపాల్,రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ అమరకొండ తిరుపతి,రాష్ట సలహాదారులు మగ్గిడి తిరుపతి,జిల్లా అధ్యక్షులు జవుడాల సత్తన్న,మండల అధ్యక్షులు పాలాజీ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి దుమ్మల ఎల్లయ్య గ్రామ అద్యక్షులు పూడూరి సతీష్,చిట్యాల చంద్రయ్య,పందిరి రాజు,పుల్ల లచ్చన్న,తోకల హరీష్ పాల్గొన్నారు.
Gulf : గల్ఫ్ లో చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన టిజిడబ్ల్యుడబ్ల్యుసి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on