ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ కు నివాళి జగ్జీవన్ రామ్ కు నివాళులర్పిస్తున్న నాయకులు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి,
పురపాలక కేంద్రంలో శనివారం బాబు జగ్జీవన్ రామ్ 38వ వర్ధంతిని పురస్కరించుకుని బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో 38వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి 4వ వార్డ్ కౌన్సిలర్ పెద్దల చక్రపాణి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్ము సంతోష్, గ్యార సందీప్, విగ్రహ కమిటీ అధ్యక్షుడు చెరుకు నరేష్, ఎర్ర పోచమ్మ దేవాలయ చైర్మన్ పోతగల బాబు, నాయకులు చెరుకు వెంకటేష్, కుక్క బాల నరసింహ, పెద్దల సుధాకర్, సతీష్, శ్యామ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.