
ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
స్థానిక మార్కండేయ స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి, అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని 40 సార్లు పటించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు కటకం తుకారం, చిక్క విష్ణు, ప్రధాన కార్యదర్శి ఎలగందుల నరసింహ, జిల్లా గోరక్ష అధ్యక్షుడు బల్ల దుర్వాసులు, పట్టణ బజరంగ్ల అధ్యక్షుడు చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కస్తూరి అనిల్ కుమార్, మార్కండేయ స్వామి దేవాలయం అధ్యక్షుడు బడుగు చండీకేశ్వర్, ఉపాధ్యక్షుడు భోగ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రుద్ర బాలరాజు, కోశాధికారి మంగళపల్లి రాజా రమేష్, నాయకులు నోముల అశోక్, చక్రాల నరసింహ, రుద్ర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.