Monday, April 7, 2025
Homeభారత్జమ్మూకశ్మీర్ లో ఎన్‎కౌంటర్::నలుగురు సైనికులు మృతి?

జమ్మూకశ్మీర్ లో ఎన్‎కౌంటర్::నలుగురు సైనికులు మృతి?

నారద వర్తమాన సమాచారం

జమ్మూకశ్మీర్ లో ఎన్‎కౌంటర్::నలుగురు సైనికులు మృతి?

జమ్మూ కాశ్మీర్

జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలోని అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి ఉగ్రవా దులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు జవాన్లు ప్రాణాలను కోల్పోయారు.

జమ్మూ కాశ్మీర్ పోలీసుల రాష్ట్రీయ రైఫిల్స్,స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సైనికులు మధ్యాహ్నం 2.45 గంటలకు దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉర్బాగి వద్ద సంయుక్త కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు అధికా రులు తెలిపారు. ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌ మొదలైంది.

ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అధికారితో సహా నలుగురు సైనికులు మంగళవారం తెల్లవారు జామున మరణించారని అధికారిక వర్గాలు తెలిపాయి.

సోమవారం సాయంత్రం దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని దేశా అటవీ ప్రాంతంలోని ధరి గోటే ఉరర్‌బాగిలో రాష్ట్రీయ రైఫిల్స్, జమ్మూ కాశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దళాలు సంయుక్తంగా కార్డన్ , సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.

కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగిన తర్వాత ఉగ్రవా దులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, అయితే సవాళ్లతో కూడిన భూ భాగం, దట్టమైన చెట్లు ఉన్నప్పటికీ ఒక అధికారి నేతృత్వంలోని సైనికులు వారిని వెంబడించారని ఆయన చెప్పారు.

ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో అడవిలో మరో సారి కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయ పడ్డారని, వారిలో అధికారి తో సహా నలుగురు మరణిం చారని అధికారులు తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?