నారద వర్తమాన సమాచారం
జి పి ఎస్ జీవో..గెజిట్ ఆపాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతీ :
గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ (జి పి ఎస్ ) జీవో..గెజిట్ ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరా తీశారు. ఇప్పుడెందుకు బయటపెట్టారో విచారించాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.
కాగా జి పి ఎస్ అమలు చేస్తూ జూన్ 12న గెజిట్ ఇవ్వడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అన్నీ మండిపడుతున్నాయి.