Tuesday, April 15, 2025
Homeఆంధ్రప్రదేశ్టిడ్కో ఇళ్ల లబ్దిదారులందరికీ త్వరలోనే మంచిరోజులు: లావు, ప్రత్తిపాటి ...

టిడ్కో ఇళ్ల లబ్దిదారులందరికీ త్వరలోనే మంచిరోజులు: లావు, ప్రత్తిపాటి చిలకలూరిపేట టిడ్కో ఇళ్లు పరిశీలించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి

నారద వర్తమాన సమాచారం

టిడ్కో ఇళ్ల లబ్దిదారులందరికీ త్వరలోనే మంచిరోజులు: లావు, ప్రత్తిపాటి

చిలకలూరిపేట టిడ్కో ఇళ్లు పరిశీలించిన ఎంపీ లావు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి

టిడ్కో ఇళ్ల లబ్దిదారులందరికీ త్వరలోనే మంచిరోజులు వస్తాయన్నారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వైకాపా హయాంలో వారికి పూడ్చలేని నష్టం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా ఆ కష్టాల నుంచి ఉపశ మనం కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చెప్పారు. శుక్రవారం చిలకలూరిపేటలో టిడ్కో ఇళ్ల సముదాయాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేటలో ఉండటానికి నివాసం లేనటువంటి నిరుపేదలకు 4,500 టిడ్కో గృహాలను 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిందన్నారు. నాటి నుంచి గత పాలకుల దౌర్జన్యం, అవినీతి, అరాచకాల వల్ల కనీసం ఒక్కర్ని కూడా గృహప్రవేశం చేయనివ్వక పోవడం దుర్మార్గం అన్నారు. ఫలితంగా అద్దె ఇళ్లలో ఉండేవారు అద్దెల భారం, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు వడ్డీలు మోయలేక పలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్లపై లోన్లు తీసుకున్న లబ్ధిదారులపై బ్యాంకర్లు కూడా ఒత్తిడి పెంచుతుంటే ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడిపోయారన్నారు. వారి ఉసురు తగిలి వైకాపా నేతలంతా పారిపోయారని, ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తమదన్నారు. ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేయాలని, పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని, ఆస్పత్రి, పాఠశాల, వార్డు సచివాలయం, విభిన్న వార్డుల్లో ఉన్నారో వారందరి కార్డులు ఇక్కడి మార్చడం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతకాలం లబ్దిదారుల్ని బెదిరించిన వారు, టిడ్కో ఇళ్లవద్ద అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ అందరిపై కఠిన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు ప్రత్తిపాటి. సదుపాయాలన్నీ కల్పించి లబ్ధిదారులందరిని గృహప్రవేశం చేయించడానికి ఏర్పాట్లు చేయబోతున్నామని పేర్కొన్నారు. లబ్దిదారుల కోరిక మేరకు బోరు, లైట్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. మరో 2వేల ఇళ్లకు తెదేపా గత ప్రభుత్వంలోనే శంకుస్థాపన చేశామని, ఫౌండేషన్ లెవెల్‌కి కూడా వచ్చిందన్నారు. వాటిని కూడా పూర్తి చేసి లబ్ది దారులకు అందిస్తామన్నారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టిడ్కో గృహ సముదాయంలో నివసిస్తున్న ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలు పెద్దవి ఏమి కాదని అన్నారు. టిడ్కో ఇళ్లను నిర్మించడమే చాలా పెద్ద సమస్యని, అది దాదాపు 90 శాతం సమస్య పూర్తయిందన్నారు. భూసేకరణ, భవన నిర్మాణాలకు అవసరమైన నిధులు తీసుకురావడం, మంచి నాణ్యతతో ఇళ్లను నిర్మించడం అన్నింటి కంటే కష్టతరమైన పని అని, అది అయిపోయిం దని, చిన్నచిన్న పనులన్నీ తప్పక పూర్తి చేస్తామన్నారు. ఇక్కడ ప్రజలు సచివాలయం, రేషన్ దుకాణం, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలని కోరారని, ఆ మూడింటిని కూడా ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి, తాను తప్పకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ పథకాల కార్డులన్నింటినీ కూడా ఇక్కడకు మార్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రభుత్వం ఏవిధంగా అయితే బాధ్యత తీసుకుంటుందో అంతే బాధ్యతను ఇక్కడ నివసిస్తున్న వారు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ఇళ్లను ఏవిధంగా అయితే బాధ్యతగా చూసుకుంటామో అదేవిధంగా ఇక్కడ నివసిస్తున్న వారుకూడా తమ ఇళ్లగా భావించి చూసుకోవాలన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?