నారద వర్తమాన సమాచారం
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు అందుకున్న అనంతనాగ్
పిడుగురాళ్ల:
పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లిలో పశువుల డాక్టర్ ఏకుల హుస్సేన్ నాగేంద్రమ్మ దంపతులకు నలుగురు సంతానంలో ఇద్దరు కవలలు.వారిలొ ఒకరు అనంతనాగ్ పోలియో మహమ్మారి కబలించి తన బాల్య జీవితాన్ని చిదిమేసింది.ఆ సమయాన మెరుగైన వైద్యం కోసం గుంటూరు లోని సేయింట్ జోసఫ్ హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిచారు. ఫిజియోథెరపి చేయడం వల్ల అనంతనాగ్ శరీర అవయవాలు మెరుగుపడటంతో అనంతనాగ్ గ్రామంలోని సమతా కాన్వెంట్ లో చేర్పించారు.4 తరువాత క్రోసూరు మండలం చింతపల్లి ప్రాధమిక పాఠశాల హెడ్ మిస్ అయిన పాశం సూరిరత్నం టీచర్ చొరవతో 5వ తరగతిలో జాయిన్ చేసుకుంటూ ఈ బాబు ప్రేమ అభిమానాలు కోసం ఎదురు చూడకూడదు.ఆ ప్రేమాభిమానాలే ఈ బాబు కోసం ఎదురు నడిచి రావాలి అని తలచి అనంతనాగ్ తాత నాగయ్య పేరు కలిసి వచ్చే విధంగా అరోజుల్లో విడుదల అయిన ప్రేమలేఖలు సినిమాలో హీరో అనంతనాగ్ పేరు పెట్టడం జరిగింది.5,6 నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో రాజీవ్ గాంధీ వికలాంగుల పాఠశాలలో చేర్పించినారు. డిసెంబర్ 3 న ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జరిగిన వికలాంగుల జిల్లాస్థాయి పరుగు పందెంలొ రెండువ స్థానంలొ నిలిచి అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రియదర్శనిదాస్ చేతులు మీదిగా బహుమతి అందుకున్నారు.10 తరువాత ఆంధ్రపారిస్ గా పిలవబడే తెనాలిలో డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ జూనియర్ కాలేజీ లో కల్చరర్ ప్రోగామ్స్ లో తనధైన స్టైల్ లో ఆకట్టుకునేవాడు. ఈ.టి.విలో ఛాలెంజ్ 2001 డాన్స్ ప్రోగ్రాంలొ పాల్గోని యాంకర్ ఉదయభాను చేతులు మీదగా రెండువ బహుమతి అందుకున్నారు.ఫిజియోథెరపి కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే రోజున అనంతనాగ్ చేసిన డాన్స్ చుసి డాక్టర్.పుల్లగూర. ఫ్రాంక్ విశ్వ నాధ్ ఫిదా అయిపోయి 5 ఏళ్ల ఫిజియోథెరపి కోర్స్ ఉచితంగా చదివించడం జరిగింది. ఫిజియోథెరపి చదువుతున్నాపుడె అనంతనాగ్ మేధస్సులొ నుండి పుట్టింది శ్రీ ఏకుల నాగయ్య మెమోరియల్ డిసబెల్డ్ సర్వీస్ సొసైటీ ఎస్ఇఎన్ఎండీఎస్ ఈ సొసైటీ యెక్క ముఖ్యఉదేశ్యం వికలాంగులు,వృద్దులు, పేద వారికి ఉపయోగ పడడం.గత 20సంవత్సరాలనుండి ఎన్నో రకాలుగా మానవ సమాజంలో సేవలు అందిస్తూ ఉంది. వెలివాడలలో కనిపించే డాక్టర్.బి. ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని తన మిత్రమండలితో కలిసి బ్రాహ్మణపల్లి గ్రామ బస్సు స్టాండ్ లో ఏర్పాటు చేసినారు. 50.ఏళ్ల క్రితం నిర్మించిన చర్చి శిథిల అవస్థకి చేరుకున్నప్పుడు పాతచర్చిని పడగొట్టి అందరి సహకారంతో పరిశుద్ధ యెరూషలేము క్రీస్తు లూధరన్ చర్చి నిర్మించి క్రైస్తవ సమాజనికి అందిచారు. అనంతనాగ్ శృతి ఫిజియోథెరపి హాస్పిటల్ ఏర్పాటు చేసి పల్నాడు ప్రాంత గ్రామీణ ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. ఇందుకు గాను డాక్టర్ చేస్తున్న సేవ కార్యక్రమలకు దళిత ఓపెన్ యూనివర్సిటీ ఆప్ ఇండియా వైస్ చాన్సలర్ జి కృపాచారిచే అనంత్ నాగ్ డాక్టర్. బి. ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్నారు.