
నారద వర్తమాన సమాచారం:డిల్లీ:ప్రతినిధి:
తీహార్ జైలుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
నేటితో ముగిసిన కేజ్రీవాల్ ఈడీ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం
అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు.
ఆయనను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది
కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి కాకుండా ఎప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
తీహార్ జైలుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను తీసుకు వెళ్తారు.