

పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న కన్నా లక్ష్మినారాయణ
నారద వర్తమాన సమాచారం :సతైనపల్లి :ప్రతినిధి
సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఎగరవేసిన మాజీ మంత్రి వర్యులు సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ
ఈ కార్యక్రమంలో కన్నా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు నేతలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టింది తెలుగుదేశం. అణగారిన వర్గాలకు అండగా నిలిచింది పసుపు జెండా. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ ఆశయ సాధన తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రజా సంక్షేమానికి శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ అని తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ దళిత మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు