Sunday, December 29, 2024
Homeఆధ్యాత్మికంతొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశాం - పల్నాడు జిల్లా ఎస్పీ ...

తొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశాం – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్ ..

నారద వర్తమాన సమాచారం

వినుకొండ కొండపై వేంచేసిన గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరగనున్న తొలి ఏకాదశి వేడుకలకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశాం – పల్నాడు జిల్లా ఎస్పీ కంచి. శ్రీనివాసరావు ఐపిఎస్

వినుకొండ కొండపై జరగనున్న తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా దేవుని దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీస్ శాఖ తరపు నుంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఎస్పీ

కొండపై జరుగుతున్న ఈ పండుగకు ఎక్కువ సంఖ్యలో భక్తులు దేవుని దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినంత మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని నియమించడం జరిగింది.

దీనితోపాటు ఘాట్ రోడ్డు వెంబడి అదేవిధంగా కొండపై ఉన్న ఆలయం చుట్టూ భారీ కేడింగును దేవాదాయ శాఖల వారి సమన్వయంతో ఏర్పాటు చేయించడం జరిగినది.

అదేవిధంగా కొండపై పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తిన సహాయ సహకారాలు అందించడానికి మా పోలీసు వారిని అందుబాటులో ఉంచడం జరిగినది.

డ్రోన్ కెమెరా నిఘాతో ఎప్పటికప్పుడు కొండపై మరియు కొండ చుట్టూ భద్రత ఏర్పాట్లను మా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

శ్రీ స్వామివారిని దర్శించుకునే భక్తులు నిర్దేశించిన దారిలోనే కొండపైకి రావాలని మరియు వెళ్లాలని, అంతే కాకుండా అడ్డదారిలో కొండా ఎక్కి ప్రమాదాలకు గురి కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రజలందరూ కూడా పోలీసువారికి సహకరించి పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నాము అని తెలిపిన ఎస్పీ గారు.

జిల్లా పోలీస్ కార్యాలయము,
పల్నాడు జిల్లా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?