
బడుగుల తరరాతలు మార్చే ఎన్నికలు
నరసరావుపేట పార్లమెంటు చరిత్రను తిరగరాసేందుకు సిద్ధం కండి
నరసరావుపేట ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో వైసీపీలో చేరిన తెదేపా, జనసేన కార్యకర్తలు.
కండవాలు కప్పి ఆహ్వానించిన
ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్,
మంత్రి అంబటి
నారద వర్తమాన సమాచారం :నరసరావుపేట :ప్రతినిధ
రానున్న ఎన్నికల పేదల, బడుగుల తలరాతలు మార్చేవని, నరసరావుపేట పార్లమెంటు పరిధిలో బలహీనవర్గాలకు వచ్చిన రాజకీయ, రాజ్యాధికార అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు శుక్రవారం ఆయన నివాసంలో సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని గుండ్లపల్లి, రెడ్డిగూడెం గ్రామాలకు చెందిన తెదేపా, జనసేన కార్యకర్తలు వైయస్సార్ సిపిలో చేరారు. వారికి రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, సత్తెనపల్లి వైఎస్సార్ సిపి అభ్యర్థి అంబటి రాంబాబు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ లు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో బడుగు, బలహీన వర్గాల నుండి వైఎస్సార్ సిపి కి ఆదరణ మెరుగుపడిందన్నారు.
ఎన్నికల సమయంలో తెదేపా జనసేన పార్టీ ల నుంచి వైసీపీలో చేరటం శ్రేణులకు స్ఫూర్తిదాయకమని నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో 20 కుటుంబాల వారు వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకోగా వారిలో 19 కుటుంబాలు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు.
నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాకిరి యేసయ్య,చాకిరి కోటేశ్వరరావు,చాకిరి శివ, బత్తుల రవి,తేటనెల్ల గంగరాజు
తేలుకుట్ల గురవయ్య, కొక్కెర వెంకటేశ్వర్లు, కొండెద్దుల, వెంకటేశ్వర్లు,చాకిరి గురువులు,
రాజుపాలెం మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గౌతకట్ల ఆంజనేయులు గుర్రం ఆంజనేయులు కృష్ణ ఆంజనేయులు దూడల ఆంజనేయులు గోపి గుర్రం శ్రీను గౌతకట్ల మల్లికార్జునరావు చేరారు. పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సిపి నాయకులు అభినందనలు తెలియజేశారు. కష్టపడి పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి,, రాజుపాలెం మండల నాయకులు మరియు సుబ్బారెడ్డి,, ఇతర ప్రజాప్రతినిధులు,, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు