
నారద వర్తమాన సమాచారం
మే :18
సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినయని వంటి సీరియల్స్ లో నటించాడు.
చందుకు ముందు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 2015లో చందు శిల్ప అనే మహిళ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ప్రస్తుతం రాధమ్మ కూతురు , కార్తీక దీపం సీరియల్స్‌లో చందు నటిస్తున్నాడు.ఇటీవలే త్రినయని సీరియల్ నటి పవిత్ర రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. చందు ఆమె మృతిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు.