నారద వర్తమాన సమాచారం
పూరీ జగన్నాథుని రత్నభండార్‌లో ఏముంది,!
ఒడిశ
నాలుగు దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న రత్నభం డార్‌లో ఏముందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. రాజుల నుంచి సామాన్యుల దాకా శతాబ్దాలుగా జగన్నా థస్వామికి సమర్పించు కున్న కానుకల చిట్టా గుట్టు ఈరోజు వీడబోతోంది.
అయితే రత్నభండార్‌లోని మూడో గదికి మూడు తలుపులు ఉన్నాయని.. మూడో తలుపు తాళం పోయిందని ప్రచారం జరిగింది.. బిజూజనతాదళ్ పాలనలోనే రత్నభండార్ మూడో తలుపు తాళం చెవి పోగొట్టినట్లు ఆరోపణలు న్నాయి.
ఇదే విషయాన్ని బీజేపీ మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లింది. రిటైర్డ్ జడ్జి బిశ్వనాథ్ రథ్ కమిటీని వేసి.. రత్నభండార్ తలు పులు తెరిచి.. సంపద లెక్కిస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు రెడీ అయింది.
ఇక ఈ రత్నభండార్‌లో పెద్ద సింహాసనం, జగన్నాథ, బలభద్రులకు భక్తులు సమర్పించిన అరటిపువ్వు ఆకృతి చెవిదిద్దులు ఇలా ఎన్నో విభిన్న ఆభరణాలు న్నాయి. 12వ శతాబ్దంలో పూరీ ప్రాంత రాజుకు లొంగిపోయిన సామంత రాజుల కిరీటాలు, యుద్ధం లో గెల్చుకున్న విలువైన సొత్తునూ రహస్య గదిలో భద్రపరిచారని తెలుస్తోంది.
పురాతన గది శిథిలమై గోడలకు చెమ్మ రావడంతో గది పటిష్టత, ఆభరణాల భద్రత కోసం రత్న భండార్ తలుపులు తెరవాలని ఆరేళ్ల క్రితం హైకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 4, 2018న 16 మంది సభ్యుల భారత పురావస్తుశాఖ నిపుణుల బృందం గది తెరిచేందుకు వెళ్లింది.
దాదాపు 46 ఏళ్ల తర్వాత పూరీ జగన్నాథుని ఆలయం లోని భాండాగారాన్ని తెరవ నున్నారు. జగన్నాథుడి వజ్ర, వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి ఎక్స్‌పర్ట్స్ అవసరం. ఆడిట్ ప్రాసెస్‌కు కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
ఈ ఖజానాలో 15 వందల ఏళ్ల క్రితం ఉన్న ఆభరణా లు, నగలు కూడా ఉన్నా యని బిశ్వనాథ్ రథ్ కమిటీ చెబుతోంది. అయితే ఈ ఆభరణాలను గుర్తించేం దుకు నిపుణులైన స్వర్ణ కారులు, మెట్రాలజిస్టుల టీమ్‌ను అందుబాటులో ఉంచనున్నారు.
జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభర ణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదం టున్నారు అధికారులు.
ఈ సంపదను మరోచోటికి తరలించి పటిష్ఠ భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యతను పరిశీలించ నున్నారు. గట్టి భద్రత మధ్య లెక్కింపు జరగనుంది…