నారద వర్తమాన సమాచారం
నీటి సమస్య లేకుండా పల్నాడు సుభిక్షంగా ఉండాలి
వినుకొండ కొండమీద అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే జివి, మక్కెన
పల్నాడు లోని నీటి ప్రాజెక్టులన్ని పూర్తవ్వాలని, ఈ ఐదేళ్లు వర్షాలు మెండుగా పడి జలకలతో పల్నాడు ప్రాంతం సుభిక్షంగా ఉండాలని.. టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా వినుకొండ కొండమీద ఉన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో.. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. రామలింగేశ్వర స్వామి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. ఇలాంటి గొప్ప కార్యక్రమానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.