నారద వర్తమాన సమాచారం
నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ
నేడు సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ విచారణ
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహారెడ్డి విద్యుత్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేసీఆర్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నేటికి వాయిదా వేసింది. సోమవారం విచారణ జరగాల్సి ఉండడగా.. కోర్టు సమయం ముగియడంతో ఈ పిటిషన్ విచారణను ధర్మాసనం ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.