నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని ఇష్ట రాజ్యంగా అక్రమ రేషన్ బియ్యం దందా..
క్రోసూరు తెల్లవారుజామున 5 గంటలకు సమయంలో క్రోసూరు మండలం నాగవరం గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద అక్రమంగా పిడిఎస్ బియ్యం ఎ పి 07టి డి 3299 నెంబరు గల హైసర్ కంపెనీ గల మినీ లారీ ఓనర్ కం డ్రైవర్ అయినా పెమ్మసాని బ్రహ్మేశ్వర రావు క్లీనర్ భవనం శివ అను వారు అచ్చంపేట మండలం చిగురుపాడు గ్రామానికి చెందిన పోలిశెట్టి చెంచయ్య వద్ద ఉన్న రేషన్ బియ్యంను అచ్చంపేట గ్రామంలో నుండి నకిరేకల్ గ్రామానికి చెందిన వెంగళరావు కు లారీలో తీసుకుని వెళుతూ ఉండగా మార్గమధ్య క్రోసూరు మండలం నాగారం గ్రామంలో క్రోసూరు ఎస్సై వారిని పట్టుకుని వారినీ అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం వారిచే ప్రజలకు పంపిణీ చేయబడిన రేషన్ బియ్యం సుమారు 50 కేజీల 193 బస్తాలు మరియు హైసర్ బండి లారీ క్రోసూరు ఎస్సై తదుపరి కేసు విచారణ నిమిత్తం స్వాధీన పరుచుకొని క్రోసూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.పెమ్మసాని బ్రహ్మేశ్వర రావు (డ్రైవరు) భవనం శివ (క్లీనరు) పోలిశెట్టి చెంచయ్య (రేషన్ షాప్ డీలరు) వెంగళరావు (కోళ్ల ఫారం బియ్యం కొనే వ్యక్తి) వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు