Monday, April 7, 2025
Homeఆంధ్రప్రదేశ్పాడి గేదెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు.

పాడి గేదెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు.

నారద వర్తమాన సమాచారం

గేదెపై అత్యాచారం.. రాత్రిపూట కొట్టంలో పాశవిక దాడి.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ప.గో. జిల్లా రైతు

పాడి గేదెపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రివేళ పశువుల కొట్టంలో ఉన్న గేదె వద్దకు వచ్చి, దాన్ని పడగొట్టి, కదలకుండా కాళ్లను పగ్గంతో బంధించి బలవంతంగా మానభంగం చేశారని చెబుతున్నారు రైతు సీతారామయ్య. లైంగిక దాడి సమయంలో గేదే ప్రతిఘటించడంతో ఏర్పడిన గాయాలను గోరు గాట్లను పోలీసులకు, మీడియాకు చూపించారాయన. ఇప్పటికే మైనర్ బాలికలపై అత్యాచార ఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన కలిగిస్తుండగా.. గేదెపై అత్యాచారం ఘటన సంచలనం రేపుతోంది. గంజాయి మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని గేదె యజమాని పిల్లి సీతారామయ్య చెబుతున్నారు.

వ్యవసాయ బావి సమీపంలో తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలను మీడియాకు, పోలీసులకు చూపించారు సీతారామయ్య. కలెక్టర్ ఆదేశాలతో స్థానిక పోలీసులు వెటర్నరీ డాక్టర్‌తో కలిసి ఘటనా స్థలికి వచ్చి గేదెను పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అత్యాచారం జరిగిందని ఎలా గుర్తించారు?

జూలై 3వ తేదీన రాత్రి ఈ ఘటన జరిగిందని సీతారామయ్య చెబుతున్నారు. మరుసటి రోజు లక్ష్మీవారం. ఉదయమే వ్యవసాయ బావి వద్దకు వచ్చిన సీతారామయ్య.. గేదెను మేతకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, అది నడవలేకపోయింది. వెంటనే వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయన గేదెను పరిశీలించి అత్యాచారం చేశారని నిర్ధారించారు. కొన్ని హోమియోపతి మందులను సూచించి వాడమని చెప్పారు.

రైతు సీతారామయ్య.. భీమవరంలో ఉండే తన కుమారుడికి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు. కుమారుడికి రెండు రోజుల తర్వాత ఖాళీ దొరకడంతో ఆదివారం స్వగ్రామానికి వచ్చారు. తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులు గడిచినా పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో జిల్లా కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు సీతారామయ్య.

వెంటనే స్పందించిన కలెక్టర్.. దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాల్సిందిగా వీరవాసరం పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు వెటర్నరీ డాక్టర్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని గేదెను పరిశీలించారు. సీతారామయ్య తెలిపిన వివరాలను నోట్ చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?