పెదకూరపాడు లో ఎన్నికల ప్రచారం నంబూరు వసంత కుమారి
నారద వర్తమాన సమాచారం:పెదకూరపాడు:ప్రతినిధి:
పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సతీమణి వసంత కుమారి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. పెదకూరపాడు లో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నంబూరు వసంత కుమారి కి ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తుంది. గ్రామంలో కాలినడకన తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు శంకరరావు కే అంటూ ప్రజలు చెప్పడం విశేషం. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నంబూరు శంకరావుని గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పెదకూరపాడు మండలం పెదకూరపాడు గ్రామానికి టిడిపి కార్యకర్త వడ్లమూడి చెంచయ్య తదితరులు వైఎస్ఆర్సిపి లో చేరారు. నంబూరు వసంతకుమారి స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.