నారద వర్తమాన సమాచారం
మే :28
ప్రకృతి ధర్మం పరిశుభ్రతతో ఆరోగ్యం
ఆరోగ్య విస్తరణ అధికారి : శిఖా శాంసన్
సృష్టికి మూలమైన ఋతుక్రమం పై విస్తృత చర్చ, అవగాహన అవసరమని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ పేర్కొన్నారు మంగళవారం ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం పురస్కరించుకొని ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు గ్రామ శివారు ఎర్రబాలెం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కిశోర బాలికలకు, మహిళలకు జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు . యువతులతో పాటు మహిళలో ఋతుక్రమంపై అవగాహన పెంపొందించడం కోసం ఏటా మే 28న యూనిసెఫ్ ఆధ్వర్యంలో బహిష్టు పరిశుభ్రత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు రుతుక్రమం అనేది సృష్టి కార్యమని దాన్ని సామాజిక బాధ్యతగా భావించి పరిశుభ్రతపై మహిళలు యువతలు అందరిలోనూ అవగాహన పెంపొందించినప్పుడే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు పీరియడ్స్ సమయంలో రక్తాన్ని పీల్చుకోవటానికి మెరుగైన నాణ్యమైన ప్యాడ్ ల ను ఉపయోగించాలని, పిరియడ్స్ సమయంలో శానిటరీ పాడ్స్ మార్చినప్పుడల్లా చేతులను శుభ్రం చేసుకోవాలని దీంతో ఇన్ఫెక్షన్ నూ నివారించవచ్చు అన్నారు పీరియడ్స్ సమయంలో ఏ ఉత్పత్తిని ఉపయోగించిన దానిని టాయిలెట్ పేపర్లో బాగా చుట్టి డస్ట్ బిన్ లో వేయాలన్నారు టాయిలెట్లో రుతుక్రమ ఉత్పత్తులను విసిరేయడం మానేయాలన్నారు. కౌమార దశలోని బాలికలు, యువత, తల్లులు, తండ్రులు, అబ్బాయిలు ముఖ్యమైన ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని శాంసన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ యు .వి. రజిని, ఆరోగ్య కార్యకర్త డి. స్వప్న రాణి, ఆశా కార్యకర్తలు పార్వతి, సుస్మిత , అంగనవాడి టీచర్ మల్లిక, కిషోర్ బాలికలు, మహిళలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజినీ మాట్లాడుతూ పీరియడ్స్ వచ్చే ముందర తలనొప్పి, చిరాకు లేదా అలసట, పొత్తికడుపులో తిమ్మిర్లు, నడుము నొప్పి ఉంటాయన్నారు పిరియడ్స్ కు సంబంధించి అపోహలు వివరించారు