వ్యవసాయ కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు :
ములకలపల్లి రాములు
రిపబ్లిక్ హిందుస్థాన్, గరిడేపల్లి :
గరిడేపల్లి కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని వ్యవసాయ కార్మిక సంఘo రాష్ట్ర ఉపాధ్యక్షుడు ములకలపల్లి రాములు విమర్శించారు. మంగళవారం గరిడేపలీ మండల మండల కేంద్రంలో ఎమ్మెస్ భవనంలో జరిగిన వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ దారిద్ర రేఖకు దిగున ఉన్న పేదలందరికీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు అందించాలని ఉద్దేశంతో ని తీసుకొచ్చిన ఈ వ్యవస్థను మోడీ సర్కార్ ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేయాలని ప్రయత్నించడం ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వం ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన హారభద్రత చట్టాన్ని నిర్వీర్యం చేసి నగదు బదిలీ పేరుతో పేదల నోట్లో మట్టిగొట్టాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు అధిక బడ్జెట్లో కేటాయించి ప్రజా పంపిణీ ద్వారా 14 రకాల సరుకులను సబ్సిడీ ధరలతో అందించాలని డిమాండ్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రేషన్ కార్డులు పంపిణీ జరిగి 2021 నాటికి జనగణ జలగని కారణంగా లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హత కలిగిన పేదలందరికీ రేషన్ కార్డు మంజూరు చేయాలని ప్రజా పంపిణీ వ్యవస్థను అధిక నిధులు కేటాయించి అందరికి ఆహార ధాన్యాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉచితాలు అనే పేరుతో వ్యవస్థను బలహీనపరచటం సరైంది కాదని, మోడీ సర్కారు నిర్లక్ష్యం కారణంగా దేశంలో ఆకలి చాలు పెరుగుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క సమావేశంలో కార్మిక సంఘాల రాష్ట్ర కమిటీ సభ్యుడు కొదమగుండ్ల నగేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు ఎస్.కె యాకూబ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పఠాన్ మహబ్ అలీ, జిల్లా కమిటీ సభ్యుడు దోసపాటి బిక్షం తదితరులు పాల్గొన్నారు.