


నారద వర్తమాన సమాచారం
జూన్ :01
ప్రధానమంత్రి నరేంద్రమోది తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద మెమోరియల్ లో ధ్యానం చేస్తున్నారు.
తొలుత స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌కు వెళ్ళారు.
అనంతరం శ్రీపాద మండపంలో భగవతి అమ్మవారి పాదముద్రలకు పుష్పాభిషేకం చేశారు.
స్మారక మండపంలో ఉన్న ధ్యానమందిరంలో సంప్రదాయ వస్త్రాలు ధరించి ధ్యానంలో నిమగ్నమయ్యారు.
జూన్ 1వ తేదీ సాయంత్రం వరకూ ప్రధాని కన్యాకుమారిలోనే ఉండనున్నారని అధికారులు తెలిపారు.