నారద వర్తమాన సమాచారం.
ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్
జి కొండూరు ప్రతినిధి.
ఎన్టీఆర్ జిల్లా .మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఏపీ అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. దైవసాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆయనకు గౌరవప్రదంగా నమస్కరించారు.అనంతరం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు , మంత్రివర్యులు నారా లోకేష్ , ఇతర సీనియర్ నేతలకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు నమస్కరించారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు.