ఫోటో ఎక్స్పోను విజయవంతం చేయాలి:
ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భీమిడి మాధవరెడ్డి
ఫోటో ఎక్స్ పోస్టర్ని ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు భీమిడి మాధవరెడ్డి
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
హైదరాబాదులో ఈనెల 26, 27 మరియు 28 తేదీల్లో నిర్వహిస్తున్న ఫోటో ఎక్స్పో 2024 ను ఫోటోగ్రాఫర్లు అంతా హాజరై విజయవంతం చేయాలని యాదాద్రి జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అధ్యక్షుడు భీమిడి మాధవరెడ్డి కోరారు.
పురపాలక కేంద్రంలో శనివారం మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు భోగచంద్రశేఖర్ తో కలిసి పోస్టర్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఫోటో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం, ఫోటో టెక్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫోటో ఎక్స్పో కార్యక్రమానికి వివిధ కంపెనీలకు చెందిన సుమారు 200 ట్రేడ్స్ ఏర్పాటు చేయనున్నారని ఆయన అన్నారు. ఈ ఎక్స్పో కి హాజరైన ప్రతి ఫోటోగ్రాఫర్ కి ఫోటో పరివార్ కార్డుని అందజేయనున్నారని దీని ద్వారా ఎక్స్పోలో కొన్న వివిధ కెమెరాలు కంపెనీలపై రాయితీ లభించే విధంగా సౌకర్యాన్ని కల్పించాలని ఈ అవకాశాన్ని ఫోటోగ్రాఫర్లు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దోర్నాల గణేష్, ఉపాధ్యక్షులు సీత శ్రవణ్ కుమార్, కేమ విష్ణుమూర్తి, కోశాధికారి రవ్వ నవీన్, కుటుంబ భరోసా ప్రతినిధి సుంకరి నరేష్, మాజీ అధ్యక్షులు గుద్దేటి పాండు, కార్యవర్గ సభ్యులు రాయబండి వెంకటాచారి, చెరుపల్లి గణేష్, సభ్యులు దొడ్డమోని వంశీధర్, వంగూరి నరేష్, పెండం బాలలింగం, చెక్క మల్లేష్, జంగయ్య తదితరులు ఉన్నారు.