Wednesday, May 14, 2025
Homeఆంధ్రప్రదేశ్బాబును న‌మ్మితే బానిస బ‌తుకులే :అంబటి :

బాబును న‌మ్మితే బానిస బ‌తుకులే :అంబటి :

నారద వర్తమాన సమాచారం

బాబును న‌మ్మితే బానిస బ‌తుకులే

మ‌ళ్లీ వ‌చ్చేది మ‌న వైయ‌స్సార్ సిపి ప్ర‌భుత్వ‌మే.

విశ్వాస‌ఘాత‌ల‌కు, కూట‌మికి ఓటుతో బుద్ది చెప్పండి.

చిన్న చిన్న గ్రామాల్లొనూ రూ. కోట్ల సంక్షేమాభివృద్ధి

రుద్ర‌వ‌రం, బొల్ల‌వ‌రం గ్రామాలలో
మంత్రి అంబటి ఎన్నికల ప్ర‌చారం.

ప్ర‌చారంలో గుంటూరు ఏఎంసి చైర్మ‌న్ నిమ్మ‌కాయ‌ల త‌దిత‌రులు.

ముప్పాళ్ల

సంక్షేమ పథకాల లబ్దిపొందిన పేద వర్గాలు అందరూ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారని, బాబును న‌మ్మితే బానిస బ్ర‌తులేన‌ని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు , నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మండల పరిధిలోని రుద్ర‌వరం, బొల్ల‌వ‌రం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రత్యేకంగా హారతి ఇచ్చి స్వాగతం పలికారు. మహిళలు భారీ సంఖ్యలో తోడుగా నిలిచారు.అనంతరం ప్రచార రథంపై ప్రధాన వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిన్న చిన్న గ్రామాల్లోనూ కోట్ల రూపాయ‌ల సంక్షేమాభివృద్ది నిధులు మంజూర‌య్య‌య‌న్నారు. రుద్ర‌వ‌రం గ్రామంలో ఈ ఐదేళ్ల‌లో 12.74 కోట్ల నిధులు, బొల్ల‌వ‌రం గ్రామానికి రూ. 10.57 కోట్ల నిధులు మంజూర‌య్యాయ‌న్నారు. వీటిలో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్ష విధానంలో ల‌బ్దిదారుల‌కు నేరుగా బ‌దిలీ చేసిన నిధులు, అభివృద్ధి ప‌నుల‌కు స‌మ‌కూరిన నిధులు ఉన్నాయ‌న్నారు. సంక్షేమంతో పాటు శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మించుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లు , విద్యార్దులు , వృద్దులు దృవీక‌ర‌ణ ప‌త్రాల కోసం మండ‌ల కేంద్రానికి రోజుల త‌ర‌బ‌డి తిరిగే ప‌రిస్థితి లేకుండా మీ ఇంటి వ‌ద్దే ప్ర‌భుత్వ శాఖ‌లు అందించే దృవీక‌ర‌ణ ప‌త్రాలు, రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల సేవ‌లు, ఇంటి వ‌ద్ద‌కే వైద్య‌సేవలు …ఇలా ఎన్నో ర‌కాల సాహ‌సోపేత‌మైన సంస్క‌ర‌ణ‌లు ఒక్క జ‌గ‌న్‌మోహ‌న‌రెడ్డికే సాధ్య‌మైంద‌న్నారు. ఈ సంక్షేమ ఫ‌లాలు భ‌విష్య‌త్ త‌రాల‌కు అందాలంటే ప్యాన్ గుర్తుకు ఓటు వేయాల‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో నన్ను, పార్లమెంట్‌లో అనిల్ కుమార్ యాద‌వ్‌ను గెలిపించాల‌ని అంబ‌టి అభ్య‌ర్దించారు. గుంటూరు ఎఎంసి చైర్మ‌న్ నిమ్మ‌కాయ‌ల రాజ‌నారాయ‌ణ మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ గమనిస్తున్నానని బడుగు, బలహీన వర్గాలలో జగనన్న పై అపారమైన ఆదరణ ఉందన్నారు. కార్య‌క్ర‌మంలో మండ‌ల క‌న్వీన‌ర్ న‌క్క శ్రీనివాస‌రావు, నాయకులు, ప్రజాప్రతినిధులు, వైయస్సార్సీపీ అనుబంధ సంఘాల బాధ్యులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?