నారద వర్తమాన సమాచారం
బాసరలో గోదావరికి నిత్యహారతి..
తెలంగాణ
నిర్మల్ జిల్లా
:జూన్ 23
కాశీ పుణ్యక్షేత్రంలో నిరంత రాయంగా జరుగుతున్న గంగా హారతి మాదిరిగా గోదావరి పరివాహక ప్రాంతంలో వెలసిన బాసర పుణ్యక్షేత్రంలో నిత్య గంగా గోదావరి హారతి కార్యక్రమా న్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తు న్నట్లు నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ వేద భారతీ పీఠం పండితుడు, అధ్యాపకుడు గురుచరణ్ తెలిపారు.
వేద విద్యానంద గిరి స్వామి బాసరలో వేద భారతీ పీఠం అభివృద్థి ట్రస్టును ఏర్పాటు చేసి వేద పాఠశాల, గోశాల, నిత్య గంగా గోదావరి హారతి నిర్వహిస్తున్నారని అన్నారు.
ఈరోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటుచేసిన సమావేశం లో వేదాల విశిష్టతను వివరిస్తూ వేద విద్యానంద గిరి స్వామి రచించిన ఇంటింటా వేదం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం మాట్లాడుతూ లోక కల్యాణం కోసం వేద పీఠాన్ని ప్రారంభించి హైంద వ ధర్మ పరిరక్షణకు వేద విద్యానంద గిరి స్వామి ఆధ్వర్యంలో కృషి చేస్తు న్నట్లు తెలిపారు.
ప్రస్తుతం వేద పాఠశాలలో 80 మంది విద్యార్థులు వేదాలను అభ్యసిస్తున్నా రని, ప్రభుత్వం సహాయం చేస్తే మరింత అభివృద్థి చేసి విశ్వవిద్యా లయంగా తీర్చి దిద్దుతామని అన్నారు. సమావేశంలో ట్రస్ట్ వలంటీర్లు మల్లేష్ రెడ్డి, సురేష్, విజయ్‌పాల్గొ న్నారు..