నారద వర్తమాన సమచారం
బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు ప్రతీకారచర్య: ఇద్దరు భద్రత సిబ్బంది మృతి
చత్తీస్ ఘడ్
ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజా పూర్ జిల్లాలో ఈరోజు ఉదయం నక్సల్స్ దారు ణానికి పాల్పడ్డారు.
ఐఈడీని పేల్చి ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు తీశారు. మరో నలుగురు భద్రతా సిబ్బంది గాయ పడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు.
బీజాపూర్, దంతేవాడ, సుక్మా సరిహద్దు ప్రాంతంలో దర్భా డివిజన్, వెస్ట్ బస్తర్ డివిజన్ నక్సల్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో గురువారం ఉదయం భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించింది.
ఇందులో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నక్సలైట్ల దాడిలో మృతి చెందిన జవాన్లను రాయ్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ భరత్ సాహు, నారాయణపూర్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యర్ సింగ్ కాంగేగా అధికారులు గుర్తించారు.
భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని వివరించారు. గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కాగా,నిన్న బుధవారం కూడా నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించిన భద్రతా సిబ్బంది మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం వద్ద 12 మంది నక్సల్స్‌ను హతమార్చిన విషయం తెలిసిందే.
అలాగే. భారీగా ఆయుధా లను స్వాధీనం చేసుకున్నా రు. ఆ తర్వాతి రోజే నక్స లైట్లు ఐఈడీ పేల్చి జవాన్ల ప్రాణాలు తీయడం గమనార్హం..