నారద వర్తమాన సమాచారం
మే :21
బెట్టింగ్‌లు, నేతల్ని కాపాడుకోవడానికే జగన్ మేకపోతు గాంభీర్యం: ప్రత్తిపాటి
వరసగా సర్వేలన్నీ వైకాపాకు చావుడప్పు కొడుతున్నప్పటికీ బెట్టింగ్‌లు, సొంతపార్టీ నేతలు జారి పోకుండా కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి జగన్ మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. చివరకు ఒకప్పటి తన స్నేహితుడైన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా వైకాపా చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని మళ్లీమళ్లీ చెబుతున్నారంటేనే ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చ న్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఎన్నికలు గెలవడమంటే ఐ ప్యాక్ ఆర్టిస్టులు, పేటిఎమ్ బ్యాచ్‌లను పెట్టి సోషల్ మీడియాలో పోస్టింగ్‌ల ద్వారా మసిపూసి మారేడుకాయ చేయడం వైకాపా నేతలు, ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా తెలుసుకోవాలని హితవు పలికారు ప్రత్తిపాటి. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసిన ఆయన ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమైన విషయం అని, ఎన్ని స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందనే అంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఆ దిశగానే జూన్-4 ఫలితాల రోజు కూటమి విజయోత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించామని స్పష్టం చేశారు. అయిదేళ్లుగా ప్రజల్ని హింసించింది, దోచుకుతిన్నది చాలక ఇప్పటికీ గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్ల గెలవబోతున్నాం, చరిత్ర సృష్టించబోతున్నామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై వారి సొంతపార్టీలోనే జోకులేసుకుని పరిస్థితి వచ్చిందని చురకల వేశారు ప్రత్తిపాటి. చిలకలూరిపేట నియోజవర్గానికి సంబంధించి తాను మొదట్నుంచీ చెబుతున్న మాటకే కట్టుబడి ఉన్నామని, పోలైన ఓట్లలో కనీసం 80శాతం సాధిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. రాష్ట్రవ్యా ప్తంగా టాప్-10 ఆధిక్యాలు వచ్చే నియోజవర్గాల్లోనూ ఒకటిగా చిలకలూరిపేట నిలిచి తీరుతుందన డంలో ఎలాంటి సందేహం లేదన్నారు ప్రత్తిపాటి.