నారద వర్తమాన సమాచారం
బ్యాంక్ అభివృద్ధి ధ్యేయంగా
చైర్మన్ అభ్యర్థి తడఖ రమేష్
ప్రచారం నిర్వహిస్తున్న తడక రమేష్.
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
పోచంపల్లి అర్బన్ బ్యాంక్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చైర్మన్ అభ్యర్థి తడక రమేష్ అన్నారు.
పురపాలక కేంద్రంలో మంగళవారం అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా పురపాలక కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తన ప్యానల్ సభ్యులతో కలిసి ఓటర్లను ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
బ్యాంక్ అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచానని ఆయన తెలిపారు. బ్యాంకు ను అన్ని రంగాల అభివృద్ధి పరచడంతో విధాలుగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను తన ప్యానల్ సభ్యులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పానల్ సభ్యులు ఏలే హరి శంకర్, కొంగరి వెంకటేష్, రాపోలు వేణు, విడం జయప్రకాష్, భారత రాజేంద్రప్రసాద్, కర్నాటి భార్గవి, కడవేరు కవిత, కొండమడుగు ఎల్ల స్వామి, తదితరులు ఉన్నారు.