
భువనగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపుకి కృషి చేయాలి
నారద వర్తమాన సమాచారం:,భూదాన్ పోచంపల్లి:
ఈరోజు భారతీయ జనతా పార్టీ భూదాన్ పోచంపల్లి మండలంలోని టూరిజం పార్కులో పోచంపల్లి మండల అధ్యక్షుడు గుండ్ల రాజు యాదవ్ మండల కమిటీ రూరల్ మీటింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ మీటింగ్ లో ముఖ్య అతిథులు జిల్లా నాయకులు ప్రధాన కార్యదర్శి శివ, జిల్లా కన్వీనర్ చెక్క కృష్ణ, తండ రమేష్ మరియు వివిధ గ్రామాల నుండి భూత అధ్యక్షులు బూత్ కన్వీనర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరూ కార్యకర్తలు సమన్వయంగా సైనికులుగాపనిచేసిమన బిజెపి అభ్యర్థిని డాక్టర్ బుర్ర నరసయ్య గౌడ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మండలంలోని అందరి కార్యకర్తలు సమక్షంలో అందరు కలిసి జిల్లా ప్రధాన కార్యదర్శి గారికి మండల కమిటీని పూర్తిస్థాయిలో పూర్తిచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతల రామకృష్ణ, కొంత శంకర్, ప్రశాంత్ రెడ్డి, బి.వెంకటేష్, ఎస్ శ్రీనివాస్, ఎర్ర లక్ష్మణ్, బసవయ్య, అన్ని గ్రామాల కార్యకర్తలు ప్రతినిధులు పాల్గొన్నారు.