
నారద వర్తమాన సమాచారం
జూన్ :03
ములుగు జిల్లా :
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఓ వ్యక్తి మృతి.
వాజేడు మండలం కొంగాలగుట్టపై ఘటన.
ఉదయం కట్టెల కోసం అడవికి వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు.
పోలీసులను హతమార్చడం కోసం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒకరు మృతి.
మరో ఇద్దరి కి తీవ్ర గాయాలు.
మృతుడు జగన్నాధపురం గ్రామానికి చెందిన ఏసు గా గుర్తింపు.
గాయపడ్డవారు ఇదే గ్రామానికి చెందిన రమేష్, ఫకీర్.
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఏజెన్సీ.