నారద వర్తమాన సమాచారం
మే :28
అయ్యప్ప భక్తులకు శుభవార్త
మాస పూజకు రోజుకు 50 వేల మంది భక్తులను వర్చువల్ క్యూ ద్వారా దర్శనానికి అనుమతించాలని శబరిమల ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.
దీంతో పాటుగా టికెట్లను ఆన్లైన్లో కేటాయించనున్నామని, క్యూ ద్వారా దర్శనం చేసుకునే అయ్యప్ప భక్తులకు ఇన్సూరెన్స్ పాలసీని అందించనున్నామని అధికారులు తెలిపారు.
ఇన్సూరెన్స్ పాలసీ కోసం బుకింగ్ సమయంలో భక్తుల నుండి కేవలం రూ.10వసూలు చేయనున్నామని వెల్లడించారు.