నారద వర్తమాన సమాచారం
ముస్తాబాద్ బాబా దేవాలయంలో ఈనెల 21న గురుపూర్ణిమ వేడుకలు..
విజయవాడ –
జులై 19:-
కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో ఉన్న శ్రీ విజయ దుర్గ సమేత మల్లికార్జున స్వామి మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వార్ల ఆలయంలో ఆదివారం 21వ తేదీన గురు పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ చైర్మన్ జి వి ఎస్ పద్మావతి ట్రస్టీలు సీనియర్ జర్నలిస్టు నిమ్మ రాజు చలపతిరావు, ఎం దుర్గాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి స్వరూప శ్రీ విజయ దుర్గ అమ్మవారికి ప్రీతిగా శ్రీ చక్ర నవావర్ణార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర పూజ రుతికవారుణ, మహాన్యాస పారాయణ, సూర్య నమస్కారములు, శ్రీ విజయ దుర్గ సమేత మల్లికార్జున స్వామి వారి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 108 కలసాభిషేకం, శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారికి అభిషేకములు మరియు శ్రీ సద్గురు సాయినాథ స్వామి వారికి 108 కేజీల పుష్పాభిషేకము శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతము, లక్ష్మీ గణపతి పూర్ణాహుతి, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతాయని ఆలయ చైర్మన్ పద్మావతి తెలిపారు. యాజ్ఞాక బ్రహ్మ శ్రీకరం మురళీ శర్మ, ఆలయ అర్చకులు ఇటికాల నాగ పవన్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో పూజాభిషేక కార్యక్రమాలు జరగనున్నాయని ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చైర్మన్ పద్మావతి కోరారు.