
మెగా రక్తదాన శిబిరం విజయవంతం..
కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం..
రక్తదాతలు ప్రాణదాతలే ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్..
నారద వర్తమాన సమాచారం కామారెడ్డి జిల్లా ప్రతినిధి: మే 18
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల్ల గ్రామంలో శ్రీ భక్తాంజనేయ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైష్ ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్లారెడ్డి డి ఎస్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 17 సంవత్సరాలుగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ,రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడమే కాకుండా, రక్తదానం పట్ల అవగాహనను,తల సేమియా వ్యాధి చిన్నారుల కోసం ఇలాంటి మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని కామారెడ్డి రక్తదాతల సమూహ సేవలు తెలంగాణ రాష్ట్రాకే ఆదర్శమని అన్నారు.చిన్న గ్రామమైన ఆదర్శంతో ముందుకు వచ్చి 78 యూనిట్ల రక్తాన్ని అందజేయడం గ్రామ యువతకు సామాజిక సేవ పట్ల ఉన్న బాధ్యత కు నిదర్శనం అన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,రాజా గౌడ్ శ్రీకాంత్ రెడ్డి లను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.రక్తదాతలకు ప్రశంస పత్రాలను జ్యూస్ బాటిల్లను కీ చైన్లను అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు డాక్టర్ బాలు,డాక్టర్ వేదప్రకాష్,గంప ప్రసాద్ జమీల్,ఎర్రం చంద్రశేఖర్, కిరణ్,వెంకటరమణ కొడబోయిన శ్రీనివాస్,బద్ద పావరాజ్ రాజరాజేశ్వర యూత్,బద్ధ శ్రీనివాస్ ఈర్ల సాయిలు,సిద్ధి రాములు సంజీవరెడ్డి గ్రామస్తులు యువజన సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగింది.