నారద వర్తమాన సమాచారం
జూన్ :21
రాజకీయం అంటే సేవ
మాపై నమ్మకంతోనే ఉపాధ్యాయులు కూటమికి అండగా నిలబడ్డారు
మా ప్రభుత్వం ఉపాధ్యాయులకు తోడుగా ఉంటాం.. వారి డిమాండ్స్ ను నెరవేర్చేందుకు కృషి
రాజారెడ్డి చేసిన మేలు మరువనిది
ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటమే అని నేను గట్టిగా నమ్ముతానని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు వెల్లడించారు. ఈరోజు నరసరావుపేట పట్టణంలోని, ఏ1 కన్వెన్షన్ లో.. ఆక్సి్ఫర్డ్ రాజారెడ్డి గారు టీచర్స్ తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు పాల్గొన్నారు. రాజారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కూటమిపై నమ్మకంతో ఉపాధ్యాయులు మాకు తోడుగా నిలబడ్డారని, వారు న్యాయబద్దంగా అడుగుతున్న డిమాండ్స్ ను నెరవేర్చందుకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. ప్రజలు జరిగే మంచిని కచ్చితంగా గమనిస్తారని, నాయకుని ప్రవర్తనను, వారు చేసే సేవలని పరిగనిస్థారని, అందుకు ఉదాహరణ ఈ ఎలక్షన్ అని అన్నారు. నాయకులు లోపం వల్లనే కొన్ని జిల్లాల్లో గత ప్రభుత్వ పార్టీ ఖాతా కూడా తెరవలేదని అన్నారు. టీచర్ లు ప్రభుత్వ స్కూల్స్ మరింత అభివృద్ధి జరిగేలా పాత్ర వహించాలని,, విద్యార్థుల శాతం పెంచాలని, వారిలో నైపుణ్యాలు పెంచాలని కోరారు. రాజారెడ్డి గారు పార్టీ గెలుపు కోసం చేసిన మరువనిది అని అన్నారు.